మోడీ నిర్ణయం పట్ల ప్రశంసలు కురిపించిన టీం ఇండియా కోచ్ రవి శాస్త్రి...!

SMTV Desk 2017-09-04 12:52:01  Indian Prime Minister Narendra Modi, Rashtrapati Bhavan,Central cabinet, Olympic medalist Rajyavardhan Singh Rathore as sports minister,Chief Coach of India

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4 : భారత ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన రాష్ట్రపతి భవన్ లో కేంద్ర కేబినెట్ పదవులకు క్రీడల శాఖ మంత్రిగా ఒలింపిక్స్ మెడలిస్ట్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ను నియమించడంపై టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి సంతోషం వ్యక్తం చేశాడు. ఒక టాప్ స్పోర్ట్స్ పర్సన్ కు క్రీడల శాఖ దక్కడం ఆనందకరమైన విషయమని ఆయన తెలిపారు. ఇది మోదీ తీసుకున్న గొప్ప నిర్ణయమని పేర్కొన్నారు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ లో డబుల్ ట్రాప్ షూటింగ్ లో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ వెండి పథకాన్ని సాధించారు. దశాబ్దకాలంపైగా షూటర్ గా కొనసాగిన ఆయన కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో కూడా పాల్గొని ఎన్నో పథకాలను సాధించిన విషయం తెలిసిందే. వీటితో పాటు ఆయనకు ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.