ఉత్తరకొరియా చర్యలపై ట్రంప్ మండిపాటు

SMTV Desk 2017-09-04 12:10:19  North Koreas bomb experiment, amerika president donald tramp

వాషింగ్టన్, సెప్టెంబర్ 4 : ఉత్తరకొరియా చేపట్టిన బాంబు ప్రయోగం ఉద్రిక్తతను మరింత పెంచింది. ఈ చర్యపై అగ్రరాజ్యం మాత్రం కారాలు మిరీయాలు నూరుతుంది. ఉత్తరకొరియాను ఆర్థికంగా దెబ్బతీయాలని వ్యూహరచన చేస్తుంది. ఉత్తరకొరియాతో వ్యాపార సంబంధాలు పెట్టుకున్న దేశాలతో అన్ని రకాల వాణిజ్య సంబంధాలు నిలిపివేశే అంశాన్ని పరీశిలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఉత్తరకొరియా ఓ దుర్మార్గమైన దేశమని సాయం చేస్తున్న చైనాకు ఆ దేశం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఉత్తరకొరియాతో బుజ్జగింపు విధానంతో మాట్లాడితే కుదరదని దక్షిణ కొరియాకు స్పష్టం చేసినట్లు ట్రంప్ తెలిపారు. అణువస్ర పరీక్షలు క్షిపణి ప్రయోగాల నేపథ్యంలో అమెరికా ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. అమెరికా రక్షణమంత్రితో సమావేశమైన ట్రంప్ వివిధ అంశాలపై చర్చించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ద్వీపాలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లితే భారీ ప్రతి స్పందన ఎదుర్కోక తప్పదని ట్రంప్ తో భేటీ అనంతరం అమెరికా రక్షణమంత్రి ఉత్తరకొరియాను హెచ్చరించారు. ఉత్తరకొరియా చేపట్టిన చర్యలను తీవ్రంగా ఖండించిన ఐక్యరాజ్యసమితి నూతన పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసింది. రేపు అత్యవసర పరిస్థితులు చక్కబెట్టేందుకు తీసుకోవాల్సిన ప్రతిచర్యలపై చర్చించనుంది.