అనుమానాస్పదంగా మృతి చెందిన యువతి...!

SMTV Desk 2017-09-04 11:09:28  karnool, adhityanagar, prakasam,

కర్నూలు, సెప్టెంబర్ 4: కర్నూలు లోని ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. కర్నూలు లోని అదిత్యానగర్ లో డాక్టర్ చిరంజీవి ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న రజిని, అకస్మాత్తుగా చున్నీతో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. బంధువుల కథనాల ప్రకారం.... ప్రకాశం జిల్లా బురుజురు గ్రామానికి చెందిన రజిని ఓ ఏడాది నుండి డాక్టర్ ఇంట్లో పనిమనిషిగా చేస్తుంది. ఈ ఘటన డాక్టర్ భార్య ఇంట్లో లేనప్పుడు జరగడం వల్ల ఆమె మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.