వైసీపీ అధినేత పై మండిపడుతున్న ఆనందబాబు

SMTV Desk 2017-09-03 16:24:58  Lotus Pond, Tolet board, Andhra Pradesh Minister Anand Babu,Vice-chairman Jaganmohan Reddy

ఆంధ్రప్రదేశ్, సెప్టెంబర్ 3 : జగన్ కు త్వరలో టూలేట్ బోర్డు పెట్టడం ఖాయమంటున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనందబాబు.. అసలు విషయంలోకి వెళితే .. ఏపీకి పట్టిన అతిపెద్ద శని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అని, వారానికోసారి కోర్టుకెళ్లే జగన్‌ పాదయాత్ర చేస్తే ప్రజలు నవ్వుతారని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవిపై ఆశ తప్ప.. ప్రజల సమస్యలపై ధ్యాస జగన్ కు లేదని, నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలతో కూడా ఆయనలో మార్పు రాలేదన్నారు. నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ పురపాలక ఎన్నికల్లో ఓటమిని భరించలేని జగన్, ప్రజలపై తన అక్కసు వెళ్లగక్కుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి జగన్‌ నిరోధకుడుగా మారారని ఆరోపించారు. రాజధాని, భోగాపురం విమానాశ్రయం నిర్మాణాలకు భూములు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లొచ్చిన జగన్, ప్రజలకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.