ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్

SMTV Desk 2017-09-03 15:17:03  hyderabad, bollywood star akshay kumar, the great indian laughter challenge 5,

హైదరాబాద్, సెప్టెంబర్ 3: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ గర్భం దాల్చినట్టుగా ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ వైరల్ అవుతుంది. ఈ వీడియో లో అక్షయ్ కుమార్ ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చినట్టు చూపించడం ఆశ్చర్యకర౦. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అక్షయ్ కుమార్ గర్భం దాల్చడమేంటి?, కవలలకు జన్మనివ్వడం ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తాయి... అయితే అసలు విషయం ఏంటంటే ‘ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ 5’అనే టీవీ షోకి అక్షయ్ కుమార్ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా అక్షయ్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారట. రెండు రోజుల క్రితం పోస్ట్ చేసిన అక్షయ్ ‘దునియా సోచ్ రహీ హై యే అజూబా కైసే హువా?’అని పేర్కొన్నారు.