కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ముగిసిన వెంటనే చైనాకు బయల్దేరిన మోదీ

SMTV Desk 2017-09-03 14:04:08  china, bharath narendra modi, going china, bricks meeting,

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3 : కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ మూగియగానే భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు బయల్దేరారు. చైనా నేతృత్వంలో క్సియమెన్ లో ఈ నెల 3 నుంచి 5 వరకు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా (బ్రిక్స్) దేశాల సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సదస్సులో పాల్గొనేందుకు మోదీ చైనాకు బయల్దేరారు. అయితే ఈ దేశల అధినేతలు 3న చైనా చేరుకోనున్నారు. 4న బ్రిక్స్ సమావేశంలో సహకారం, సమస్యలు, పరిష్కారాలు, భవిష్యత్ చర్యలపై చర్చలు జరిపి, అనంతరం 5న మూడు రోజుల పర్యటనకు మయన్మార్‌ వెళ్లనున్నారు. మయన్మార్‌ లో మోదీ చేపట్టనున్న తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే మొదటిసారి కావడం విశేషం. మయన్మార్‌ దేశాధ్యక్షుడు యు హ్తిన్‌ క్యావ్‌, స్టేట్‌ కౌన్సెలర్‌ ఆంగ్‌ సాన్‌ సూచీతో కలిసి మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనున్నారు.