భారీ వర్షాల కారణంగా సిమ్లాలో చోటు చేసుకున్న ప్రమాదం

SMTV Desk 2017-09-03 13:53:31  simla, himachalpradhesh, chandighard, national haiway

సిమ్లా, సెప్టెంబర్ 3 : భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ లోని చండీగఢ్ -సిమ్లా జాతీయ రహదారి వద్ద భారీగా కొండచరియలు విరిగి పడ్డాయి. శనివారం మధ్యాహ్నం ధాలీ సొరంగం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మట్టీ పెల్లలు విరిగి పడిన కారణంగా పలు వాహనాలు శిథిలాల కింద చిక్కుకున్నాయి. రహదారి పై పడినందున రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అయితే ఈ ఘటనలో ప్రాణ నష్టం మాత్రం జరగలేదు. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో సైతం కొండరాళ్లు పైనుంచి పడటంతో ఓ ట్రక్కు లోయలో పడింది. డ్రైవర్‌ ఘటన స్థలంలోనే మృత్యువాతపడగా.. దీనిలో ప్రయాణించిన మరొకరు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.