తాగుబోతు మృగానికి మరో బాలిక బలి...

SMTV Desk 2017-09-03 13:08:57  vizianagaram, bobbili, andrapradesh, gadelavalasa,

విజయనగరం, సెప్టెంబర్ 3: మానవ మృగం కిరాతకానికి ముక్కుపచ్చలారని అమాయకురైలన ఓ బాలిక బలైపోయింది. ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయనగరం జిల్లా సీతానగరం మండలం గాదేవలసలో శుక్రవారం మధ్యాహ్నం బడికి వెళ్తున్న విద్యార్థినిపై పట్టపగలే తప్పతాగిన ఓ క్రూరుడు అఘాయిత్యానికి పాల్పడటమే కాక, గొంతు నులిమి ఆమెను హత్య చేశాడు. పోలీసులు, స్థానికుల కథనాల ప్రకారం...బొబ్బిలి మండలం రెడ్డియ్యవలసకు చెందిన ఓ బాలిక(15) సీతానగరం మండలం గాదెలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. శుక్రవారం మధ్యాహ్నం భోజనానికి ఇంటికొచ్చి తిరిగి సైకిల్‌పై పాఠశాలకు వెళ్లింది. సాయంత్రంనికి అయిన ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లి తండ్రులు ఆందోళనకు గురి అయ్యారు. దీంతో స్థానికులను అడిగితే రెడ్డియ్యవలసకు చెందిన పోతల శంకరరావు బాలికతో మాట్లాడడం చూశామని చెప్పారు. బొబ్బిలి పోలీసులకు సమాచారం అందించడంతో శుక్రవారం రాత్రి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా మద్యం మత్తులో గాదెలవలస సమీప తోటల్లోకి లాక్కెళ్లి తానే అత్యాచారం జరిపి, హత్య చేసినట్లుగా శంకరరావు అంగీకరించాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని బొబ్బిలి డీఎస్పీ సౌమ్యలత తెలిపారు.తమ కూతురి మరణంతో తల్లి తండ్రుల కన్నిటిపర్య౦తమయ్యారు.