జగన్ పార్టీ పీకేసి డ్రామా కంపెనీ పెట్టుకో..అందులో రోజా డాన్స్ చేస్తుంది: అయ్యన్న పాత్రుడు

SMTV Desk 2017-09-02 16:46:23  

ఆంధ్రప్రదేశ్ సెప్టెంబర్ 2: నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీడీపీ పార్టీ వైకాపాను ఏకి పారేస్తుంది. ముఖ్యంగా నంద్యాల ఉప ఎన్నికకు ముందు రోజా టీడీపీ పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకొని వారు వైకాపా అధినేత జగన్, రోజా లపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా వీరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ త్వరలో పార్టీ జెండా పీకేసి డ్రామా కంపెనీ పెట్టుకుంటాడని.. అందులో రోజా డాన్స్ చేస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రోజా అంటేనే దరిద్రం అని ఆమె ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనమే అని అన్నారు. జబర్దస్త్ షోలో డాన్సులు చేసుకునే రోజాకు మహిళల గురించి మాట్లాడే అర్హత కూడా లేదని తీవ్రంగా విమర్శించారు.