ఓ ఉగ్రవాదిని హతమార్చిన భద్రత సిబ్బంది

SMTV Desk 2017-09-02 16:07:43  Security personnel killed by terrorist, kashmir,Kulagam district,Tantripora

కశ్మీర్, సెప్టెంబర్ 2 : జమ్ముకశ్మీర్ లో నేడు ఉదయం భద్రతాబలగాలు ఉగ్రవాదుల మధ్య చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. కుల్గాం జిల్లాలోని తాంత్రిపొరాలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందుకున్న భద్రతాబలగాలు అక్కడికి చేరుకొని తనిఖీలు ప్రారంభించాయి. దీంతో భద్రత సిబ్బంది రాకను గమనించిన ముష్కరులు వారిపై కాల్పులు ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ఎదురు కాల్పులతో ఓ ఉగ్రవాదున్ని హతమార్చారు. అయితే, ఘటనస్థలంలో కాల్పులు కొనసాగుతుండగా అక్కడ మరికొందరు ఉగ్రవాదులు ఉన్నట్లు తెలిసింది.