దాయాదులు సమరానికి రెడీ

SMTV Desk 2017-06-04 11:41:24  india,pakistan, kohli,dhoni

ఇంగ్లాండ్, జూన్ 4 : క్రికెట్ సమరానికి భారత్, పాకిస్తాన్ జట్లు సిద్ధం అయ్యాయి. ఈ ఉత్కంఠ భరితమైన మ్యాచ్ ను చూడటానికి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇంగ్లాండ్ లో జరుగుతున్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీ లో నేడు ( ఆదివారం ) మధ్యాహ్నం భారత్ పాకిస్తాన్ ల మధ్య జరుగబోతుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూద్దామని అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మ్యాచ్ బంతి బంతికి ఉత్కంఠతను రేకెత్తించడం ఖాయం గా కనిపిస్తుంది. విరాట్ కోహ్లి నేతృత్వంలో భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగే ఈ మ్యాచ్ లో భారత్ ఫేవరేట్ అని క్రికెట్ దిగ్గజలు అంచనా వేసారు. ఇంతకూ ముందు బిసిసీఐ నిర్వహించిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ల్లో 2009 మ్యాచ్ మినహా మిగితా వాటిలో భారత్ దే ఘనవిజయం. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, ధోని వంటి బ్యాట్స్ మెన్స్ తో చాలా బలం గా ఉంది. ఇక ఇంగ్లాండ్ పిచ్ పేస్ కు అనుకూలిస్తుంది. భారత్ బౌలర్లు నైపుణ్యం కనబరిస్తే ఈ సారికూడ విజయం భారత్ నే వరిస్తుంది.