రాజకీయ రంగంలో మళ్లీ బోఫోర్స్ కేసు కదలిక

SMTV Desk 2017-09-02 14:02:58  Hinduja ​​brothers, Delhi High Court, J

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2 : దేశ రాజకీయ రంగంలో అనేక ప్రకంపనలకు కారణమైన బోఫోర్స్ కుంభకోణం కేసులో మళ్లీ కదలిక వచ్చింది. ఈ కేసులో హిందుజా సోదరులపై అభియోగాలను కొట్టివేస్తూ 2005 ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. భాజపా నేత అజయ్ కుమార్ అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మసనం అక్టోబర్ 30 తరువాత దీనిపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. బోఫార్స్ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ, అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్ కు ప్రతిగా న్యాయస్థానంలో ఎలాంటి పిటిషన్ ను సమర్పించలేదు. ఫ్యుడన్ కు చెందిన ఆయుధ తయారి సంస్థ బోఫార్స్ తో పిరంగుల కొనుగోలుకు సంబంధించి భారత్ కు 1986 లో రూ.1437 కోట్ల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని దక్కించుకునేందుకు బోఫోర్స్ భారత్ కు చెందిన రాజకీయ నాయకులు, అధికారులకు ముడుపూలు ముట్ట చెప్పిందని ఆరోపణలు రాగ, ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది.