ఇప్పటికైనా జగన్ గుణపాఠం నేర్చుకుంటాడా ..? లేదా..?

SMTV Desk 2017-09-02 13:25:01  jagan, ysrcp, tdp, chandhrababu, gajan politics, andhra politics

ఆంధ్రప్రదేశ్ సెప్టెంబర్ 2: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా గైనా గెలుపొందాలని తహ తహ లాడుతున్న విషయం అందరికీ విదితమే. అయితే రాజకీయాల్లో గెలుపంటే ఏంటి..? అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేయడమా..? లేక ప్రజల మనుసులు గెలుచుకునేలా పరిపాలన చేయడమా..? ఈ రెండింటి లో జగన్ కేవలం మొదటిదాన్నే ఫాలో అవుతునట్టు ఇటీవల వెలువడ్డ ఎన్నికల ఫలితాలను గమనిస్తే మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో జగన్ గానీ పార్టీ నాయకులు గానీ ఎంత సేపు అధికార ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పితే, ఎపుడైనా సమస్యల గురించి, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడారా..? అంటే లేదనే సమాధానమే విస్పష్టం. కారణం జగన్ ఎంత సేపు బాబు పై విమర్శలు చేయడం, ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయడం లాంటివే ఎన్నికల్లో వైకాపా ఓటమికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అయితే ఈ విషయాన్ని గమనించినా పట్టనట్లు ప్రవర్తిస్తున్న జగన్ ఇప్పటికైనా ఓటమి నేర్పిన గుణపాఠం నేర్చుకుంటేనే మంచి భవిష్యత్తు జగన్ సొంతం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.