సుపారీగ్యాంగ్ తో కలిసి జర్నలిస్ట్ శ్యామ్ కుమార్ ఆడిన డ్రామా..

SMTV Desk 2017-09-02 11:20:12  vijayawada, elur, seetharamapuram, journalist shyamkumar,

విజయవాడ, సెప్టెంబర్ 2: ఏలూరులోని సీతారామపురంలో తాజాగా ఓ హత్యాయత్నం డ్రామా కేసు వెలుగులోకి వచ్చింది. జర్నలిస్ట్ శ్యామ్ కుమార్, బౌద్ధ అమరావతి పేరుతో సాయంకాల దినపత్రికను నడిపేవాడు. గత నెల ఆగస్ట్ 20 తేదిన రాత్రి 9:30 నిమిషాలకు ఇంటి ఎదురుగా ఉన్న శ్యామ్ ను సుపారీగ్యాంగ్ సభ్యులు కత్తితో పొడిచి పారిపోయారు. ఈ ఘటనతో తన తోడల్లుడు సుబ్బారావె హత్యాయత్న౦ కి పాల్పడ్డాడని సూర్యారావు పేట పోలీసులకు పిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేసి సుపారీగ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.."శ్యామ్ కుమార్ కు సుబ్బారావు కి మధ్య బిజినెస్ పరంగా కొన్ని అప్పులు ఉన్నాయి. అప్పుల బాధ నుండి బయటపడేందుకు శ్యామ్ కుమార్ ఓ సుపారీగ్యాంగ్ తో ప్రాణం పోకుండా కత్తి పోట్లు పోడిపి౦చుకున్నాడు. తన తోడల్లుడి నుంచి వచ్చే 20 లక్షలకు బదులుగా 40 లక్షలు వసూలు చేసేందుకు సుపారీగ్యాంగ్ తో కలిసి ప్రణాళిక రచించాడు. అనంతరం శ్యామ్ అనుచరులు అమెరికాలోని తోడల్లుడి కొడుక్కి ఫోన్ చేసి డబ్బులు పంపించాలని బెదిరించారు" అని పోలీసులు అసలు విషయాన్నివెల్లడించారు.