మోడీ మంత్రి వర్గ విస్తరణ ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసా..?

SMTV Desk 2017-09-02 10:31:09  modi, indian politics, political news, ministers, new cabinet ministers, cabinet ministers

ఢిల్లీ సెప్టెంబర్ 2: ప్రధాని మోడీ మంత్రి వర్గ విస్తరణ నిర్ణయంలో భాగంగా కొంత మంది మంత్రులను ఉద్వాసన పలకగా మరి కొంత మంది మంత్రులకు స్వాగతం పలుకుతున్నారు. అయితే ఇప్పటికే ఎవరెవరు పదవులను కోల్పోతున్నారు, ఎవరికి కొత్తగా స్థానం కల్పిస్తున్నారో దాదాపుగా ఖరారు అయిపోయింది. అయితే హటాత్తుగా మోడీ మంత్రి వర్గ విస్తరణ ఎందుకు చేయాల్సి వచ్చింది..? కొత్త వారికి స్థానం ఎందుకు కల్పించాల్సి వచ్చింది..? అని ప్రశ్నించుకుంటే సమాధానం విస్పష్టం. ఇక్కడ దీనికి ప్రధాన కారణంగా పని తీరు ను పరిగణలోకి తీసుకొని మోడీ తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం తొలగిస్తున్న బండారు దత్తాత్రేయ, ఉమా భారతి, రాజీవ్ ప్రతాప్ రూడీ, సంజయ్ కుమార్ బాల్యాన్, కల్రాజ్ మిశ్రా, మాహేంద్ర నాథ్ పాండే వీరంతా వారి వారి పని తీరులో నాణ్యత లోపించడం, పని తీరును ఇంకా మెరుగు పర్చుకోకపోవడం, ప్రజా సమస్యల పట్ల స్పందించక పోవడం వాటి కారణాల వల్ల వీరిని తొలగించడం జరిగింది. వీరి స్థానంలో ఎంపీ స్థానంలో ఉండి విశేష ప్రతిభ కనబరిచిన వారికి కొత్తగా స్థానం కల్పించడం జరిగింది.