కలాంలాగే కోవింద్: చంద్రబాబు

SMTV Desk 2017-09-01 18:30:33  thirupathi, sv arts college, ap cm chandrababunaidu, president of india ramnath kovind, ramnath kovind,

తిరుపతి, సెప్టెంబర్ 1: తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సన్మానం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ... "మాజీ రాష్ట్రపతి అబ్దుల్ క‌లాంలాగే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జీవితం విద్యార్థులకు ఆదర్శమని అన్నారు. అయన యుపి లోని చిన్న గ్రామంలోని ఓ బీద కుటుంబంలో జన్మించారు.. ప్రతిరోజు ఆరు కిలో మీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకి చదువుకోడానికి వెళ్ళేవారు. ఒక సాధారణ మనిషి దేశ అత్యున్నత పదవిలో ఉండటం ప్రజాస్వామ్య దేశ ప్రత్యేకత అని చెప్పారు. మొట్టమొదటి సారి మన దేశ అధ్యక్షుడు రామనాథ్ కోవింద్ ఆంధ్రప్రదేశ్ కి వచ్చి తిరుపతి వెంకటేశ్వర స్వామిని, తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకొని దేశ ప్రజల శ్రేయస్సును కోరారు. ఇప్పటివరకు తిరుపతి ఎడ్యుకేషనల్ హబ్ గా ఉంది.. ఇక మెడికల్ హబ్ గా చేయాలన్నదే ప్రభుత్వ ఆశయం” అని ఆయన పేర్కొన్నారు.