ఫామ్ ను అందిపుచ్చుకోలేక పోతే ఆటకు ఆనందంగా వీడ్కోలు చెబుతాను: శ్రీలంక కెఫ్టెన్ మలింగా

SMTV Desk 2017-09-01 18:29:22  Srilanka, Cricket, Malinga retirement, lasith malinga

శ్రీలంక, సెప్టెంబర్ 1: గాయం కారణంగా 19 నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న శ్రీలంక కెప్టెన్, పేసర్ లసిత్ మలింగా, తన రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని ఇండియాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత తీసుకుంటానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటతీరు సరిగా లేకపోతే వీడ్కోలు పలకడమే ఉత్తమం అనే అభిప్రాయాన్ని వెల్లబుచ్చారు. భారత్‌తో సిరీస్ ముగిసిన తర్వాత చూద్దామని, శరీరం సహకరిస్తే పర్వాలేదని... లేకపోతే జట్టులో ఉండి ఏం ప్రయోజనమని తెలిపారు. ఫామ్ ను అందిపుచ్చుకోలేక పోతే, సరిగ్గా బంతిని విసరలేకపోతే ఆటకు ఆనందంగా వీడ్కోలు పలుకుతానని చెప్పారు. ఇటీవల జింబాబ్వే‌తో పాటు భారత్‌తో జరిగిన సిరీస్ లోనూ లంక సరైన ప్రదర్శన చేయలేకపోయిందని మలింగా ఆవేదన వ్యక్తం చేశాడు.