బాబా గుర్మీత్ దత్తపుత్రిక కోసం గాలింపు చర్యలు

SMTV Desk 2017-09-01 17:10:12  Adopted Daughter Honeypreet Insan, Haryana defense official look out notices, Aditya Insan

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1 : ఇటీవల అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్త పుత్రిక హనీప్రీత్‌ ఇన్సాన్‌ కోసం హర్యానా రక్షణాధికారి లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆమెతో పాటు గుర్మీత్ ప్రధాన అనుచరుడు ఆదిత్య ఇన్సాన్ కోసం రక్షణ సైన్యం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఇద్దరు పైన దేశ ద్రోహం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించిన పంచకుల పోలీసు కమిషనర్, ఇందు కోసం దేశ వ్యాప్తంగా విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ లకు సమాచారం అందించినట్లు తెలిపారు. అత్యాచార కేసులో దోషిగా తేలగానే, గుర్మీత్ తప్పించుకొని పారిపోయ్యేందుకు హనీప్రీత్, ఆదిత్య కుట్రపన్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. వీరికి సాయపడేందుకు సిద్ధమైన ఐదుగురు హర్యానా పోలీసులను విధుల నుంచి తొలగించారు.