కేసీఆర్ ను కలిసిన ఉదయభాను..పొలిటికల్ ఎంట్రీ షురూనా...?

SMTV Desk 2017-09-01 15:28:40  udhayabhanu, film industry, anchor udhaya bhanu, udhayabhanu trs

హైదరాబాద్ సెప్టెంబర్ 1: తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి యాంకర్ గా పేరు తెచ్చుకున్న ఉదయభాను కొద్ది రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. అయితే ఈమె కేసీఆర్ ను ఇలా కలవగానే ఉదయభాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని సోషల్ మీడియా లో వార్తలు గుప్పు మన్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో సొంతంగా పాట రాసుకొని దానిని ఆలపించడం తో ఆ సమయంలో ఆ పాట యువకుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించింది. అయితే ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అని భావించిన అప్పటి అధికార కాంగ్రెస్ దీనిని సోషల్ మీడియా నుంచి సైతం తొలగించింది. ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమ యాంకర్లలో తన దైన ముద్రను వేసుకున్న ఉదయభాను రాబోయే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరుపున పోటీ చేయబోతున్నారని సోషల్ మీడియా లో పుకార్లు షికార్లు చేశాయి. ఉదయభాను కేవలం మర్యాద పూర్వకంగా మాత్రమే కేసీఆర్ ను కలిశారని రాజకీయాల్లోకి రావడానికి ఆమె ఎంత మాత్రం సిద్ధంగా లేరని తెలుస్తుంది.