విక్రం ల్యాండర్ శిధిలాలను గుర్తించిన నాసా

SMTV Desk 2019-12-03 12:12:48  

చంద్రయాన్-2లో భాగమైన విక్రం ల్యాండర్ ఈ ఏడాది సెప్టెంబర్ 7న చంద్రుడి ఉపరితలంపై కూలిపోయిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు దాని పరిస్థితిని అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్త షణ్ముగ సుబ్రహ్మణియన్ కనిపెట్టారు. లూనార్ రీకనైసన్స్ ఆర్బిటర్ ద్వారా విక్రం ల్యాండర్ శిధిలాలను గుర్తించి వాటి ఫోటోలను కూడా తీసినట్లు నాసా ప్రకటించింది. ఆ ఫోటోలను నాసా విడుదల చేసింది.

విక్రం ల్యాండర్ చివరి క్షణాలలో తలక్రిందులవడంతో చాలా వేగంగా దూసుకుపోయి చంద్రుడి ఉపరితలాన్ని చాలా బలంగా డ్డీకొంది. దాంతో అది ముక్కలు ముక్కలైపోయింది. దాని శిధిలాలు కొన్ని కిలోమీటర్ల దూరం వరకు చెల్లాచెదురుగా పడినట్లు నాసా గుర్తించింది. అయితే శిధిలాలు చిన్న చిన్న ముక్కలైపోవడంతో నాసా విడుదల చేసిన చిత్రాలలో అవి స్పష్టంగా కనిపించడం లేదు. చిత్రంలో నీలి రంగు చుక్కలు చంద్రుడి ఉపరితలంపై విక్రం శిధిలాలు పడిన ప్రాంతాన్ని, ఆకుపచ్చ రంగు చుక్కలు విక్రం శిధిలాలను సూచిస్తున్నట్లు నాసా తెలిపింది.