భారతీయుడు 2 ఇంట్రస్టింగ్ అప్డేట్

SMTV Desk 2019-11-25 12:00:04  

లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం భారతీయుడు 2. ఈ సినిమాను టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికి తెలుసు. ఆ సినిమా వచ్చిన చాలా ఏళ్ల తర్వాత భారతీయుడికి సీక్వెల్ రాబోతుంది. ఇక ఈ సినిమాను మొదటిదానికంటే అద్భుతంగా తెరకెక్కించాలని చూస్తున్నాడు శంకర్. ఈ సినిమాలో కమల్ కు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.

ఇక ఈ సినిమా సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నదంట. అదికూడా నెగిటివ్ షేడ్స్ ఉండే రోల్ లో విజయ్ సేతుపతి కనిపించనున్నాడు. ఇక గతం లో విజయ్ సేతుపతి స్టార్ హీరోలైన రజినీకాంత్, కమలహాసన్ లతో కలిసి నటించాలని ఆశపడ్డాడు. రజిని తో ఛాన్స్ దక్కలేదు. కమల్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ కోటేసాడు విజయ్. దాంతో తెగ సంబరపడిపోతున్నాడంట విజయ్. మరి విజయ్ ఈ సినిమాలో ఎలా అలరిస్తాడో చూడాలి. ఇప్పటికే ఈ సినిమా పై మంచి బజ్ ఉంది. ఇక విజయ్ సేతుపతికూడా షూటింగ్ లో జాయిన్ అవ్వడంతో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.