ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ & అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో సెక్యూరిటీ స్ర్కీనర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అనుభవం ఉండాలి. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హత: ఏదైనా డిగ్రీ. సంబంధిత టెక్నికల్ సర్టిఫికెట్లు కలిగి ఉండాలి. హిందీ, ఇంగ్లిష్‌తో పాటు స్థానిక భాష తెలిసి ఉండాలి. పాస్‌పోర్ట్ ఉండాలి.
వయోపరిమితి: 15.11.2019 నాటికి 45 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తులు నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.
ఎంపిక విధానం: ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. AAI Cargo Logistics & Allied Services Company Ltd.” పేరిట న్యూఢిల్లీలో చెల్లుబాటు అయ్యేలా డిడి తీయాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. డిడిపై అభ్యర్థి పూర్తి పేరు, ఫోన్ నెంబర్, పుట్టినతేది వివరాలను రాయాలి.
జీతం: నెలకు రూ.25,000- రూ.30,000. ఇతర అలవెన్సులు ఉంటాయి.
దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 09.12.2019.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Joint General Manager (HR),
AAI Cargo Logistics Allied Services Company Limited,
AAICLAS Complex, Delhi Flying Club Road,
Safdarjung Airport,
New Delhi-110 003.