టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అలక

SMTV Desk 2019-11-16 14:11:12  

టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అలకబూనారు.. అసలు ఆయన అలకకు కారణం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీయే.. ఓ టీవీ డిబేట్‌లో రాజేంద్రప్రసాద్, వంశీ మధ్య చర్చ వ్యక్తిగత దూషణలకు దారితీసింది.. దీంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందారు.. వంశీ తనను అన్ని తిట్లు తిట్టినా.. పార్టీలో తనకెవరూ మద్దతు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వంశీ తనని వ్యక్తిగతంగా దూషించినా పార్టీ నుంచి ఎవరూ స్పందించలేదని మనస్థాపం చెందారు.. పార్టీ న్యాయం చేస్తేనే వంశీకి వ్యతిరేకంగా పోరాడుతానని తేల్చేశాడు. ముఖ్యంగా.. బోడె ప్రసాద్‌ పేరు ప్రస్తావన వచ్చినప్పుడు కూడా రాజేంద్రప్రసాద్, వంశీ మధ్య మాటల తూటాలు పేలాయి.. చివరకు బోడె ప్రసాద్‌ కూడా మద్దతు పలకపోవడంపై రాజేంద్రప్రసాద్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, రాజేంద్రప్రసాద్‌ను బుజ్జగించడానికి టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగింది.. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ను రాజేంద్రప్రసాద్ ఇంటికి పంపి.. బుజ్జగించే ప్రయత్నాలు చేసింది.