పలు దేశాల్లో పని చేయని వాట్సాప్... స్పందించని వాట్సాప్ సంస్థ

SMTV Desk 2017-09-01 14:05:47  Whatsapp, Social Media, Messanging app not working, Twitter, Social media

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: నెటిజన్లను తనదైన రీతిలో ఆకట్టుకుంటున్న వాట్సాప్ యాప్ ఉన్నట్టుండి పనిచేయకపోతే... ఆ ఆలోచనే చాలా కష్టంగా భావిస్తారు దీనికి అలవాటు పడినవాళ్లు. మరి అలాంటి పరిస్థితి నిజంగా తలెత్తితే.. ఇదే పరిస్థితి యూర‌ప్, ఆసియా, ద‌క్షిణ అమెరికాలోని ప‌లు దేశాల్లో తలెత్తగా ఏం చేయాలో తోచని వారు సోష‌ల్ మీడియాలో ఫిర్యాదులతో దుమారం రేకెత్తించారు. కానీ, వాట్సాప్ నుంచి ఎలాంటి స‌మాధానం రాలేదు. ట్విట్ట‌ర్‌లో `#వాట్సాప్‌డౌన్‌` పేరుతో వినియోగ‌దారులు ఎన్నో ఫిర్యాదులు చేశారు. దుర‌దృష్ట‌క‌ర విష‌యం ఏంటంటే... వాట్సాప్‌కి అధికారికంగా ట్విట్ట‌ర్ అకౌంట్ ఉన్నా, కంపెనీ దాన్ని పెద్ద‌గా ఉప‌యోగించ‌దు. వాట్సాప్ అధికారిక ట్విట్ట‌ర్ అకౌంట్ ని 2016లో అప్‌డేట్ చేయడం గమనార్హం. అప్పటినుండి ఆ ఖాతాలో ఎలాంటి యాక్టివిటీ లేదు. అయిన‌ప్ప‌టికీ వాట్సాప్‌లో ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా వినియోగ‌దారులు ట్విట్ట‌ర్‌ని ఆశ్ర‌యిస్తారు. కొద్ది సమయానికి మొరాయించిన వాట్సాప్ ప‌నిచేస్తోందని కొన్ని దేశాల వినియోగ‌దారులు తెలిపారు. కాగా, దీనికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.