వల్లభనేని వంశీ వ్యాఖ్యలతో ఆర్జీవీ సీక్వెల్ ‘రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్'

SMTV Desk 2019-11-16 14:08:50  

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చగా మారాయి.. ఏపీలో టీడీపీని ఓ కుదుపు కుదుపే స్థాయిలో.. ఊగిపోతూ సీరియస్‌గా వ్యాఖ్యలు చేస్తున్నారు వంశీ.. అయితే, వల్లభనేని వంశీ ఇంటర్వ్యూ చూడగానే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు వెంటనే ఓ ఐడియా వచ్చిందట.. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’కు సీక్వెల్ తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చిందట.. వెంటనే మైండ్‌లో సినిమా టైటిల్ కూడా మెదిలిందట.. వెంటనే సోషల్ మీడియాలో ఆ టైటిల్ కూడా ప్రకటించారు ఆర్జీవీ.


తన శిష్యుడు.. సిద్దార్ధ తాతోలు దర్శకత్వంలో కేఆర్‌కేఆర్ మూవీని తెరకెక్కిస్తుండగా.. ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్‌, సాంగ్స్‌కు మంచి రెస్పాన్సే వచ్చింది. ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.. తొలి భాగానికి ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్ పెట్టిన వర్మ.. ఇక సీక్వెల్‌కు ‘రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్’ అనే టైటిల్ ఖరారు చేశారు. దానికి వల్లభనేని వంశీ ఇంటర్వ్యూల్లో చేస్తున్న ఫైరింగ్ వ్యాఖ్యలను చూస్తే తనకో ఆలోచన వచ్చిందని.. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’కు సీక్వెల్ తీయాలని అనుకుంటున్నానని.. దానికి ‘రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్’ అనే టైటిల్ పెట్టబోతున్నానని ప్రకటించాడు ఆర్జీవీ.