పెయిడ్ ఆర్టిస్టుల కంపెనీ పెట్టింది జగనే .. !!

SMTV Desk 2019-11-12 14:40:35  

చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా నిర్మాణాత్మక పాత్ర పోషించి హుందాగా ఉండాల్సింది పోయి అసూయ, అహంకార ప్రవర్తనతో పాతాళంలోకి జారిపోయాడు అని విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ పై తెలుగుదేశం నేత బుద్ధా వెంకన్న స్పందించారు. ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి పై మండిపడ్డారు. "మీ సీఎంగారి చెత్త నిర్ణయాలతో కడుపుమండి ప్రజలు మాట్లాడుతుంటే పెయిడ్ ఆర్టిస్టులని అవమానపరుస్తారా ? పెయిడ్ ఆర్టిస్టుల కంపెనీ పెట్టింది మీ జగన్ గారే. జీతాలిచ్చి మరీ ప్రజలమీదకి వదిలారు ఇప్పుడు వారందరికీ ప్రజాధనం దోచిపెడుతున్నారు లిస్ట్ వదలమంటారా?ఆర్టిస్టుల బాగోతం ఎంటో తేల్చుకుందాం. అని అన్నారు. "ప్రతిపక్ష నేతగా నిర్ణయాత్మక పాత్ర అంటే ఏంటి విజయసాయి రెడ్డి గారు?ట్రైన్లు తగులబెట్టడం, అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవడానికి పంటలు తగులబెట్టడం, కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టడమా? అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని నరికేయండి, కాల్చేయండి అని చొక్కా చించుకోవడమా? అని ప్రశ్నించారు.