'రొమాంటిక్' షూట్ లో రమ్యకృష్ణ

SMTV Desk 2019-11-11 13:38:34  

పూరి జగన్నాథ్ నిర్మాతగా .. ఆయన తనయుడు ఆకాశ్ హీరోగా రొమాంటిక్ చిత్రం రూపొందుతోంది. అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా, కథానాయికగా కేతిక శర్మ తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకున్నారు. గోవా షెడ్యూల్లో ఆమె జాయిన్ అయ్యారనేది తాజా సమాచారం.

తన సినిమాలకి సంబంధించిన ఒకటి రెండు సీన్స్ అయినా గోవాలో తీయడమనేది పూరి సెంటిమెంట్. అలా రొమాంటిక్ షూటింగ్ కూడా ఆయన అక్కడ పెట్టాడు. ఈ షెడ్యూల్లో రమ్యకృష్ణ కాంబినేషన్ సీన్స్ ఉండటం వలన, తాజాగా షూటింగులో ఆమె జాయినైంది. నెల రోజుల పాటు జరిగే ఈ షూటింగులో కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు ఒకటి రెండు పాటలను కూడా చిత్రీకరించనున్నారు. ఈ ప్రేమకథా చిత్రంతో హీరోగా ఆకాశ్ నిలదొక్కుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.