కోచ్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్... కాపాడాలంటూ ఆర్తనాదాలు

SMTV Desk 2019-11-11 13:35:07  

కాచిగూడలో ఓ ట్రాక్ పై నిలిచి ఉన్న హంద్రీ ఎక్స్ ప్రెస్ ను ఎదురుగా వచ్చిన ఎంఎంటీఎస్ రైలు ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎంఎంటీఎస్ డ్రైవర్ చిక్కుకుపోయారు. ప్రాణాపాయం నుంచి ఆయన బయటపడినప్పటికీ, తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. తనను కాపాడాలంటూ ఆయన ఆర్తనాదాలు చేస్తుండటం కలచివేస్తోంది. కోచ్ లో ఉన్నఆయనకు ఆక్సిజన్ అందించడంతో పాటు సెలైన్ ఎక్కిస్తున్నారు. మరోవైపు, ఆయను కోచ్ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు రైల్వే సిబ్బంది తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మెటల్ తో తయారుకాబడిన కోచ్ ను గ్యాస్ కట్టర్ తో కట్ చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ ఘటనలో 30 మంది వరకు గాయపడ్డారు.