కేన్సర్‌ను పూర్తిగా నయం చేసే దిశగా!!

SMTV Desk 2019-11-11 13:30:19  

కేన్సర్‌.. ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టుకొస్తుంది. ఈ వ్యాధి బారినపడి ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరిపాలిట శాపంగా మారిన కేన్సర్ ను పూర్తిగా నయం చేసే ప్రయత్నాల్లో అమెరికా పరిశోధకులు తొలి అడుగు వేశారు. కేన్సర్ ను అరికట్టే కౌపాక్స్‌ తరహా కొత్త వైరస్‌ను సృష్టించారు. దీనితో అన్ని రకాల కేన్సర్‌లనూ సులువుగా నిరోధించవచ్చని అంటున్నారు.

కేన్సర్‌ వైద్య నిపుణుడు ప్రొఫెసర్‌ యుమన్‌ ఫాంగ్‌ దీనిపై వివరాలు తెలిపారు. సీఎఫ్‌33 అనే చికిత్సతో అన్ని రకాల కేన్సర్‌లను తగ్గించవచ్చని వివరించారు. తమ పరిశోధనలో భాగంగా ఎలుకలపై చేసిన ప్రయోగంలో కేన్సర్‌ కణితులను తగ్గించగలిగామన్నారు. జలుబుకు కారణమయ్యే ఈ వైరస్‌ను మెదడు కేన్సర్‌ చికిత్సకు మందుగా వినియోగించామని, ఫలితం కనపడిందని అన్నారు. కొన్నాళ్లపాటు ఈ వైరస్‌ను అందించడం ద్వారా కేన్సర్‌ కనుమరుగైందని వెల్లడించారు.