నిజంగానే రాం చరణ్, విక్రం కుమార్ ల సినిమా ఉంటుందా

SMTV Desk 2019-11-09 17:09:06  

రంగస్థలం తర్వాత రాం చరణ్ క్రేజ్ డబుల్ అయ్యిందని చెప్పొచ్చు. ఆ సినిమాలో చిట్టిబాబుగా చరణ్ తన నట విశ్వరూపం చూపించాడు. ఇక ప్రస్తుతం రాజమౌళి డైరక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న రాం చరణ్ ఆ తర్వాత సినిమా ఎవరితో చేస్తాడో తెలియాల్సి ఉంది. అసలైతే కొరటాల శివ, త్రివిక్రం లాంటి డైరక్టర్స్ రాం చరణ్ తో సినిమా చేయాల్సి ఉన్నా అతను మాత్రం విక్రం కె కుమార్ తో సినిమా చేయాలని చూస్తున్నాడట.

రీసెంట్ గా విక్రం కె కుమార్ చరణ్ ను కలిసి స్టోరీ డిస్కస్ చేశాడట. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాం చరణ్ విక్రం తోనే సినిమా చేస్తాడని అంటున్నారు. నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమా సూపర్ హిట్ అయితే విక్రం కుమార్ తో సినిమా చేసినా వర్క్ అవుట్ అయ్యేది కాని ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు అయినా సరే చరణ్ మాత్రం విక్రం కుమార్ తోనే సినిమా చేస్తాడని అంటున్నాడట. చరణ్ తీసుకున్న ఈ డెశిషన్ మళ్లీ అతన్ని రిస్క్ లో పడేస్తుందని అంటున్నారు. నిజంగానే రాం చరణ్, విక్రం కుమార్ ల సినిమా ఉంటుందా ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.