కాకినాడ ప్రజలకు ధన్యవాదాలు... స్మార్ట్ సిటీ నిర్మిద్దాం పదండి: మంత్రి నారా లోకేష్

SMTV Desk 2017-09-01 13:14:58  Kakinada, Corporation Election Results, AP IT Minister, Nara Lokesh, Social Media, Twitter

అమరావతి, సెప్టెంబర్ 1: చాలా సంవత్సరాల తరువాత కాకినాడలో తెదేపా విజయకేతనం ఎగురవేయడంపై ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అభివృద్ధికి పట్టం కట్టిన కాకినాడ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులకు వెల్లడించారు. ఆయన తన పోస్ట్‌లో 'అద్భుత విజయాన్ని అందించిన కాకినాడ ప్రజలకు ధన్యవాదాలు! నారా చంద్రబాబునాయుడి నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజలు అందించిన మరో విజయానికి ఇది సాక్ష్యం. కాకినాడ స్మార్ట్ సిటీ నిర్మిద్దాం పదండి!' అంటూ వెల్లడించారు.