టాయిలెట్లో కెమెరా..... ఫిర్యాదుకు లంచం!!

SMTV Desk 2019-11-09 16:33:01  

కెఫేలోని టాయిలెట్లోకి వెళ్లిన ఓ మహిళ షాక్‌కు గురైంది. అక్కడ రహస్యంగా ఓ చిన్న కెమెరా ఏర్పాటు చేసిఉండడం చూసి కంగారు పడిపోయింది. వెంటనే తేరుకుని ఆ కెమెరాను ఫొటోలు తీసింది. వెంటనే యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని అక్కడే ఉన్న మరో మహిళ తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.

వివరాల్లోకి వెళితే.. ‘స్థానిక హింజవాడి ప్రాంతంలోని బీహైవ్ అనే కెఫేలో వాష్‌రూంలో కెమెరా ఉన్నట్లు ఓ మహిళ కెఫే యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. అయితే వారు అక్కడకు పరిశీలించడానికి వచ్చి ఆమెను బయట ఉంచేశారు. వారు మాత్రం లోనికి వెళ్లి కెమెరాను తొలగించేశారు’ అంటూ ఆ మహిళ రాసుకొచ్చారు. అంతే కాకుండా కెమెరా గురించి ఫిర్యాదు చేసిన మహిళను, ఆమె స్నేహితులు చెబుతున్న విషయాన్ని మొదట ఒప్పుకోని యాజమాన్యం తరువాత వారికి లంచం ఇచ్చేందుకు కూడా ప్రయత్నించిందని ఆమె చెప్పుకొచ్చారు. ఈ విషయం ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో పూనా పోలీసులు రంగప్రవేశం చేసి స్థానిక పోలీసు స్టేషన్‌కు కేసును అప్పగించినట్లు చెప్పారు.