నటుడు గొల్లపూడికి అస్వస్థత.. పరామర్శించిన ఉపరాష్ట్రపతి

SMTV Desk 2019-11-06 15:15:54  

టాలీవుడ్ సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీ రావు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. పలు చిత్రాల్లో తన ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి స్థానం సంపాదించిన మారుతీరావు మంచి రచయిత, సాహితీవేత్త కూడా. ఇక గత కొద్దిరోజలుగా అనారోగ్యంతో సతమతం అవుతున్న ఆయనను ఇటీవల కుటుంబసభ్యులు చెన్నైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించారు.ప్రస్తుతం కొంత పర్వాలేదని అక్కడి డాక్టర్లు చెప్తున్నట్లు తెలుస్తుంది.

కాగా చెన్నై పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గొల్లపూడి మారుతీరావుని పరామర్శించారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గొల్లపూడిని వెంకయ్య వెళ్లి కలిశారు. మారుతీరావు గారు తెలుగు సినిమాకు, అలానే తెలుగు భాష అభ్యున్నతికి చేసిన సేవలు మనం ఎప్పటికీ మరువలేవని, తప్పకుండా ఆయన అతి త్వరలో కోలుకుని మళ్ళి మన అందరి మధ్యకు వస్తారని ఉపరాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేసారు.