తహసీల్దార్ విజయారెడ్డి కేసు: వెలుగు లోకి కీలక విషయాలు

SMTV Desk 2019-11-06 13:12:39  

తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం కేసు విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. వనస్థలిపురం ఏసీపీ జయరాం ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ సాగుతోంది. అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయంలో భద్రతా సిబ్బందిని ఉంచాలని నెల రోజుల నుంచి తహసీల్దార్ జిల్లా కలెక్టర్‌ను కోరుతున్నారు. వివాదాస్పద భూముల ఆందోళనలను విజయారెడ్డి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సురేష్ కుటుంబానికి చెందిన తొమ్మిది గుంటల భూమే వివాదానికి కారణంగా పోలీసులు గుర్తించారు. ఈ భూమిని సురేష్ కుటుంబం ఒక మాజీ ప్రజాప్రతినిధికి అమ్మింది. దీనిపై గ్రామసభల్లో తహసీల్దార్, రెవెన్యూ అధికారులతో గతంలో సురేష్ గొడవకు దిగాడు,