5 కోట్లు పెడితే చీప్ అంటారేంటి..?

SMTV Desk 2019-11-06 13:11:49  

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి చేసిన మొదటి సినిమా మీకు మాత్రమే చెప్తా. డైరక్టర్ తరుణ్ భాస్కర్ ను హీరోగా పెట్టి చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ అయ్యిందని చెప్పాలి. అయితే సినిమా రివ్యూస్ మాత్రం అంత గొప్పగా రాలేదు. ప్రతి ఒక్కరు సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ గురించి నెగటివ్ గా రాశారు. దీనిపై విజయ్ దేవరకొండ తండ్రి వర్ధన్ మాట్లాడారు. సినిమాకు 5 కోట్ల బడ్జెట్ పెడితే చీప్ అనడం ఏమి బాగాలేదని అన్నారు.

సినిమా అంతా నైట్ మోడ్ లో తీయడం.. పోస్ట్ ప్రొడక్షన్ సరిగా జరగకపోవడం వల్ల సినిమా అలా వచ్చిందని అన్నారు. అంతే తప్ప సినిమా చీప్ అన్న కామెంట్స్ పై అసహనం వ్యక్తం చేశారు వర్ధన్ దేవరకొండ. షమ్మీర్ సుల్తాన్ డైరక్షన్ లో తెరకెక్కిన మీకు మాత్రమే చెప్తా సినిమా లాస్ట్ ఫ్రై డే రిలీజై టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు రాబడుతుంది. తన సినిమాల విషయంలో అసలు కాంప్రమైజ్ అవని విజయ్ సొంత ప్రొడక్షన్ లో వచ్చిన తొలి సినిమాకు ఇలాంటి కామెంట్స్ రావడం ఊహించి ఉండడు.