గ్రామవాలంటీర్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

SMTV Desk 2019-11-01 15:23:06  

గ్రామవాలంటీర్ పోస్టులకు సంబంధించి రెండో విడత దరఖాస్తు ప్రక్రియ నవంబరు 1న ప్రారంభమైంది. అభ్యర్థులు నవంబరు 10 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 15 నుంచి అభ్యర్థులకు దరఖాస్తుల పరిశీలన చేపట్టనున్నారు. నవంబరు 16 నుంచి 20 వరకు ఎంపిక చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను నవంబరు 22న ప్రకటిస్తారు. అనంతరం వీరికి నియామక పత్రాలు ఇస్తారు. నియామక పత్రాలు పొందినవారు డిసెంబరు 1 నుంచి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. గ్రామ సచివాలయాలతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఏపీలోని 13 జిల్లాల పరిధిలో మొత్తం 9674 గ్రామ వాలంటీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబరు 1 నాటికి 18 - 35 సంవత్సరాల మధ్య వయసుండి.. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులందరూ గ్రామ వాలంటీరు పోస్టులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను అమలు చేయనున్నారు.
షెడ్యూలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: నవంబరు 1 నుంచి.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: నవంబరు 10.
➥ దరఖాస్తుల పరిశీలన: నవంబరు 15 నుంచి.
➥ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు: నవంబరు 16 నుంచి 20 వరకు.
➥ ఎంపికైన అభ్యర్థుల జాబితా: నవంబరు 22.
➥ విధుల నిర్వహణ: డిసెంబరు 1 నుంచి.
ఏపీలో 1,94,592 గ్రామ వాలంటీర్లను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. అయితే వారిలో 1,84,944 మంది మాత్రమే విధుల్లో చేరడంతో.. 9,648 ఖాళీలు ఏర్పాడ్డాయి. చివరకు ఖాళీల సంఖ్యను 9674గా అధికారులు నిర్ణయించారు.