అధికారులు పని చేస్తే సరిపోతుందా..? మరి నాయకుల మాటేంటి..?

SMTV Desk 2017-09-01 12:45:29  

హైదరాబాద్ సెప్టెంబర్1: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల విస్తరణ లో భాగంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్త జిల్లాలకు కొత్త అధికారులను నియమించిన కేసీఆర్ వారి పని తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త జిల్లాల అభివృద్ధికి కలెక్టర్లు చేస్తున్న పని తీరు నిజంగా హర్షించదగ్గదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి వీరి కృషి ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ఇక్కడివరకు కేసీఆర్ ఆలోచించిన విధానం బాగానే ఉంది. కానీ అధికారులపై దృష్టి పెట్టినంతగా నాయకులపై దృష్టి పెట్టడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికారులు పని చేసినంతగా నాయకులు పని చేయకపోవడమే ఇక్కడ ప్రధాన కారణం. అంతేకాక అధికారులకు సామాజిక పరిస్థితులపై, సమస్యలపై ఉన్నంత అవగాహన నాయకులకు కొరవడడం కూడా ఇందుకు మరొక కారణంగా చెప్పవచ్చు. పైగా ఆదేశించిన పనులను అమలుపరచడంలో అధికారులు నాయకులకు సాటిరారు. బహుశా ఈ కారణాల వల్లే కాబోలు కేసీఆర్ నాయకుల కంటే అధికారులు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారని అనుకుంటున్నారేమో...!