ప్రభాస్ తో పెళ్లికి రెడీ..!

SMTV Desk 2019-10-29 17:07:34  

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో తాను పెళ్లికి రెడీ అంటుంది కాజల్ అగర్వాల్. అదేంటి ఇప్పటికే ప్రభాస్, అనుష్కల మధ్య పెళ్లి వార్తలు రకరకాలుగా వస్తుంటే కాజల్ ఇలా అనడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. ఫీట్ అప్ విత్ స్టార్స్ షోలో భాగంగా కాజల్ అగర్వాల్ తో స్పెషల్ చిట్ చాట్ చేసింది మంచు లక్ష్మి. ఈ షోలో భాగంగా రాం చరణ్, ప్రభాస్, ఎన్.టి.ఆర్ లలో ఎవరిని పెళ్లాడుతావు.. ఎవరితో డేట్ కు వెళ్తావు.. ఎవరిని చంపేస్తావని అడిగింది మంచు లక్ష్మి.

దానికి సమాధానంగా కాజల్ రాం చరణ్ ను చంపేస్తానని.. ఎన్.టి.ఆర్ తో డేట్ కు వెళ్తా.. ప్రభాస్ తో పెళ్లికి రెడీ అన్నది కాజల్ అగర్వాల్. దశాబ్ధంపైగా తెలుగులో స్టార్ క్రేజ్ సంపాదించిన కాజల్ ఇప్పటికి వరుస అవకాశాలు అందుకుంటుంది. తెలుగులోనే కాదు తమిళంలోనూ సూపర్ పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మడు పెళ్లి ఎప్పుడంటే మాత్రం నచ్చిన వాడు దొరకాలి కదా అంటూ మాట దాటవేస్తుంది.