బాలీవుడ్ కి 'భాగమతి' రీమేక్

SMTV Desk 2019-10-25 14:38:01  

భాగమతి సినిమా బాలీవుడ్ రీమేక్ విషయంలో ఊహాగానాలు నిజమవుతాయని తెలుస్తోంది. ఈ సినిమాలో అనుష్క పాత్రలో భూమి పెడ్నేకర్ నటించనున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. తెలుగులో ‘భాగమతి’ సినిమాను తెరకెక్కించిన జి.అశోక్.. రీమేక్‌ను కూడా తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ‘టాయిలెట్’, ‘ఏక్ ప్రేమ్‌కథ’ సినిమాలను రూపొందించినవారే ఈ సినిమాను కూడా నిర్మించనున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం చిత్రబృందం సినిమాకు తగ్గ లొకేషన్ కోసం గాలిస్తోందని తెలుస్తోంది. అన్నీ సెట్ అయితే త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనున్నట్టు సమాచారం. అయితే బాలీవుడ్ స్టార్ ఒకరు.. ‘భాగమతి’ సినిమా డైరెక్టర్ అశోక్‌ను కలిసి రీమేక్‌కు తాను దర్శకత్వం వహిస్తానని పేర్కొన్నట్టు సమాచారం. సినిమాలోని ప్రతి ఒక్కరూ ఆ స్టార్ ఎవరై ఉంటారా? అని ఆశ్చర్యపోతున్నారు.