ఈ యాడ్ కి మహేశ్ ఎంత తీసుకున్నాడో తెలిస్తే షాక్

SMTV Desk 2019-10-25 14:37:27  

తెలుగు సినీ ఇండస్ట్రీని ఏలుతున్న అగ్ర నటుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకడు. ఆయన కష్టపడే తత్వం, అంకిత భావం ఆయనను తెలుగు సినీ ఇండస్ట్రీ శిఖరాగ్రాన నిలిపాయి. తాజాగా మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి దీపావళి సందర్భంగా స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఒక యాడ్‌లో మహేష్ తన భార్యాపిల్లలు.. నమ్రత, గౌతమ్, సితారతో కలిసి సందడి చేశాడు. మొదటి సారి మహేష్ ఫ్యామిలీ మొత్తం ఒక ప్రకటనలో కనిపించడం ప్రేక్షకులకు కన్నుల పండువగా ఉంది.

30 సెకన్ల ఆ వీడియోలో మహేష్‌ను ఒక డిఫరెంట్ లుక్‌లో ప్రెజెంట్ చేశారు. తన ఫ్యామిలీతో కలిసి కనిపించి ఆ యాడ్‌కి మహేష్ అదనపు ఆకర్షణతో పాటు మైలేజ్‌ను తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ యాడ్ యూట్యూబ్ ట్రెండింగ్‌లో తొలి స్థానంలో ఉంది. అయితే తన ఫ్యామిలీతో కలిసి 30 సెకన్ల పాటు కనిపించిన ఈ యాడ్ కోసం మహేష్ ఎంత తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవడం ఖాయం. మహేష్ ఈ యాడ్ కోసం రూ. 6 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని సమాచారం.