వరద బాధితులను ఆదుకున్న గూగుల్

SMTV Desk 2017-09-01 11:09:54  bharath, nepal, bangladhesh, google, gunj, save the children

న్యూఢిల్లీ, సెప్టెంబర్, 1 : ఇటీవల భారత్, బంగ్లాదేశ్, నేపాల్ వరద బీభత్సం సృష్టించడంతో, వరద బాధితుల పరిస్థితులను గమనించిన గూగుల్ వారికి సహాయార్ధంగా రూ. 10 లక్షల డాలర్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. గూంజ్, సేవ్ ద చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ సాయం చేసినట్లు వెల్లడించారు. ఈ మూడు దేశాల్లో వరద బాధితులకు ఆహార కొరత ఏర్పడడంతో, వారికి జీవనోపాధి, ఆహరం, తాగునీరు వంటి తాత్కాలిక సాయం అందించారు. భారత్ లోని 75వేల వరద బాధిత కుటుంబాలకు గూంజ్ స్వచ్ఛంద సంస్థ ఆహరం, దుప్పట్లు అందిస్తుంది. ఈ రెండు సంస్థల ద్వార బాధితులకు అండగా నిలుస్తున్న గూగుల్ వరద బాధితులకు సంబంధించి అంతర్జాలంలో ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించడం జరిగింది.