వన్డే సిరీస్ లో 4-0 ఆధిక్యంలో భారత్ ఘన విజయం...

SMTV Desk 2017-09-01 10:54:07  BCCI, India, Srilanka, fourth Odi, Colombo, Odi series 2017, India Score

కొలంబో, సెప్టెంబర్ 1: కొలంబో వేదికగా గురువారం ఆతిధ్య జట్టు శ్రీలంకతో భారత జట్టు తలపడిన విషయం తెలిసిందే. అయితే నాలుగో వన్డేలోనైన విజయం సాధించాలని ఉవ్విళ్లూరిన లంక జట్టుకి ఈ మ్యాచ్ లో కూడా చుక్కెదురైంది. శ్రీలంక జట్టుపై 168 పరుగుల భారీ తేడాతో టీంమిండియా ఘన విజయం సాధించింది. దీంతో గత మూడు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియాకు 4-0 ఆధిక్యం లభించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 375 పరుగుల చేసింది. దీంతో 376 పరుగుల భారీ విజయ లక్ష్యంతో పిచ్‌లోకి దిగిన లంక జట్టు 42.4 ఓవర్లకే ఆలౌట్ అయ్యి ఘోర పరాజయం పాలైంది. ఆలౌట్ సమయానికి శ్రీలంక 207 పరుగులు చేసింది.