భార్యభర్తలను విడగొట్టిన బిగ్ బాస్..!

SMTV Desk 2019-10-21 18:56:37  

మరో రెండు వారాల్లో ముగుస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 ప్రస్తుతం ఇంట్లో ఆరుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. వచ్చే వారం ఒకరి ఎలిమినేషన్ ఉంటుంది. ఆ తర్వాత టాప్ 5లో టైటిల్ విన్నర్ ప్రకటించే రోజు మిగిలిన ఐదుగురులో ముగ్గురిని ఎలిమినేట్ చేసి అక్కడే టాప్ 2లో ఒకరిని ఫైనల్ విన్నర్ చేస్తారు. లాస్ట్ వీక్ ఇంటి సభ్యులంతా నామినేట్ అవగా వితిక ఇంటి నుండి బయటకు వచ్చింది.

ఈ సీజన్ బిగ్ బాస్ హౌజ్ లో భార్యా భర్తలైన వరుణ్ సందేష్, వితికలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. అయితే ఫైనల్ గా వితిక ఈ వారం బయటకు వచ్చింది. క్రేజీ కపుల్ గా వరుణ్, వితిక 80 రోజులుగా బిగ్ బాస్ హౌజ్ లో ఎంటర్టైన్ చేస్తున్నారు. వితిక బయటకు వెళ్లడంపై వరుణ్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు. టైటిల్ విన్నర్ గా వరుణ్, శ్రీముఖిలు మాత్రమే ఉండేట్టు పరిస్థితులు కనబడుతున్నాయి.