రాజమౌళి వెనుక అజ్ఞాత మహిళ...వైరల్ పిక్!

SMTV Desk 2019-10-19 14:42:14  

లండన్‌లోని ప్రతిష్టాత్మక ఆర్బర్ట్‌ హాల్‌లో బాహుబలి ది బిగినింగ్‌ సినిమాను ప్రదర్శిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బాహుబలి చిత్రయూనిట్ అంతా లండన్‌ చేరుకున్న సంగతి తెలిసిందే. హీరో ప్రభాస్‌తో పాటు రానా దగ్గుబాటి, అనుష్క, నిర్మాత శోభు యార్లగడ్డ, దర్శకుడు రాజమౌళి లండన్‌లో సందడి చేస్తున్నారు. తాజాగా వారంతా లండన్‌లో కలిసి దిగిన ఫోటోనూ అభిమానుల కోసం ట్విటర్‌లో షేర్‌ చేశారు.అయితే ఈ ఫోటోలు ఇప్పుడు మాట్ టాపిక్‌గా మారాయి. ఫోటోలో వరుసగా ప్రభాస్‌, రాజమౌళి, అనుష్క, శోభు, రానాలు కనిపిస్తున్నారు. అయితే రాజమౌళి కాళ్ల మధ్య మరో మహిళ కాలు కనిపించటం చర్చకు దారితీసింది. రాజమౌళి ట్విటర్‌లో, ప్రభాస్‌ ఫేస్‌ బుక్‌ పేజ్‌లలో పోస్ట్ చేసిన ఈ ఫోటోలలో ఈ కాలు కనిపిస్తోంది. దీంతో రాజమౌళి వెనక ఉన్న ఆ అజ్ఞాత మహిళ ఎవరు అన్ని చర్చించుకుంటున్నారు నెటిజెన్లు.అయితే ఇదే ఫోటోను ప్రభాస్‌ ఇన్స్‌స్టాగ్రామ్‌ పేజీలో పరిశీలిస్తే మాత్రం కాలు కనిపించటం లేదు. కొంత మంది బాహుబలి రీ యూనియన్‌ ఫోటోలలో దెయ్యం అంటూ ప్రచారం చేస్తున్నారు. అసలు కొన్ని ఫోటోల్లోనే ఆ కాలు ఎలా వచ్చింది. ఎవరైనా ఫోటోషాప్‌ చేశారా..? రాజమౌళి, ప్రభాస్‌లు ఫోటోషాప్‌ చేసిన ఫోటోలను ఎందుక ట్వీట్ చేశారు.? లాంటి ప్రశ్రలు వినిపిస్తున్నాయి. ఈ చర్చలకు తెరపడాలంటే జక్కన్న టీం స్పందించాల్సిందే.