కొత్త రూ.1,000 నోటు... సోషల్ మీడియాలో తెగ ప్రచారం

SMTV Desk 2019-10-19 12:47:40  

భారత్‌లో కరెన్సీ నోట్లపై ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ గా మారుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు రూ.2000 నోటుపై అనేక వార్తలు రావడంతో ఆర్బీఐ స్పందించింది. అయితే ఇప్పుడు రూ.1,000 నోట్లు వైరల్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ రోజే మార్కెట్‌లోకి కొత్త రూ.1,000 నోటును తీసుకువస్తోందంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. కరెన్సీ నోట్లు కూడా నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఇవ్వన్నీ ఫేక్ వార్తలు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్తగా ఎలాంటి రూ.1,000 నోటును మార్కెట్‌లోకి తీసుకురాలేదు.