కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు నేటి నుంచి వైద్యపరీక్షలు

SMTV Desk 2019-10-18 16:48:33  

తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా ఎంపికైన అభ్యర్ధులకు నేటి నుంచి వైద్యపరీక్షలు జరుగనున్నాయి. ఎంపికైన అభ్యర్ధులందరికీ వారి రిజిస్టర్డ్ మొబియల్ నెంబర్లకు మెసేజ్ ద్వారా ఈ విషయం తెలియజేశామని ఖమ్మం జిల్లా పోలీస్ కమీషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. ఆ సమాచారం ప్రకారం వారు నిర్దేశించిన సమయంలో వైద్యపరీక్షలకు హాజరుకావలని తెలిపారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో, ఖమ్మం జిల్లాలో అభ్యర్ధులకు పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో ఉదయం 6 గంటల నుంచి వైద్య పరీక్షలు నిర్వహించబడతాయని తెలియజేశారు. మిగిలిన జిల్లాలలో కూడా అభ్యర్ధులకు వైద్యపరీక్షలకు సంబందించి సమాచారం మొబైల్ ఫోన్లకు పంపబడుతుంది.