రివ్యూ: రాజుగారి గది 3

SMTV Desk 2019-10-18 16:47:55  

తారాగణం:

నటీనటులు: అవికా గోర్‌, అశ్విన్ బాబు, అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, హ‌రితేజ‌, అజ‌య్ ఘోష్‌, ఊర్వశి త‌దిత‌రులు

సినిమాటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు

బ్యాన‌ర్‌: ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

ద‌ర్శక‌త్వం: ఓంకార్‌

హర్రర్ సినిమాలకు ఇటీవల కాలంలో మంచి ఆదరణ లభిస్తోంది. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ లాభాలు తీసుకొచ్చే జానర్ కావడంతో ఈ జానర్లో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ జానర్లో గతంలో రాజుగారి గది సీరీస్ లో రెండు సినిమాలు వచ్చాయి. అందులో మొదటి సినిమా మంచి విజయం సొంతం చేసుకోగా, రెండో సినిమా రాజుగారిగది 2 పరాజయం పాలైంది. ఇప్పుడు ఇదే సీరీస్ లో మూడో సినిమా రాజుగారిగది 3 తీశారు. ఈరోజు రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.

కథ :

వైద్య విధ్యర్హిని అయిన అవికా గోర్ ను నిత్యం ఓ ఆత్మ అంటిపెట్టుకొని రక్షణగా ఉంటుంది. ఆమెను అల్లరి చేయాలని చూసిన వాళ్ళ భరతం పడుతుంది. ఇదిలా ఉంటె, ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న అశ్విన్ బాబు ఆకతాయి పనులు చూసి కాలనీలోని వ్యక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అతని ఆగడాల నుంచి బయటపడాలి అంటే అశ్విన్ ను అవికా ప్రేమలో పడే విధంగా చేయాలని అనుకుంటారు. అవికా ప్రేమలో పడే సమయంలో అశ్విన్ బాబు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు...? అవికా ను అంటిపెట్టుకొని ఉన్న ఆత్మఅశ్విన్ ను ఏం చేసింది..? అసలు ఆ ఆత్మ ఎవరు అన్నది మిగతా కథ.

విశ్లేషణ:

మాములుగా రియాలిటీ సినిమాలకు హర్రర్ సినిమాలకు చాలా తేడా ఉంటుంది. హర్రర్ సినిమాలు కేవలం వినోదం కోసమో లేదంటే.. భయపెట్టేందుకు తీస్తారు. అందులో లాజిల్ లు వెతక్కూడదు. లాజిక్ కు దూరంగా ఉంటాయి. అందులో సందేహం అవసరం లేదు. హర్రర్ సినిమా అనే ప్రేక్షకులను థ్రిల్లింగ్ కలిగించేలా ఉండాలి. అప్పుడే సినిమా నిలబడుతుంది. అయితే, రాజుగారిగది 3 లో యక్షి అనే ఓ ఆత్మను కథకు మెయిన్ పాయింట్ గా తీసుకున్నారు. ఆ పాయింట్ చుట్టూనే కథను నడిపించారు. ఈ పాయింట్ చాలా చిన్నదిగా ఉండటంతో.. అసలు ఫస్ హాఫ్ లో కథ అన్నది మనకు కనిపించదు.. సన్నివేశాలతో కథను నడిపించారు. అసలు కథ ఏంటి అన్నది సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది. హైదరాబాద్ నుంచి హీరో హీరోయిన్లు కేరళ వెళ్లిన తరువాత అసలు కథ మొదలౌతుంది. తాజమహల్ లోకి ఎంటర్ అయ్యాక పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయి. అయితే, అవికా గోర్ ను అంటిపెట్టుకొని ఆమెను కాపాడుతున్న యక్షి ఆత్మ ఎవరు.. ఏంటి అనే విషయాలను తెలుసుకునే క్రమంలో ఆమె జీవితం రివీల్ అవుతుంది. ఆమె గురించి కథను చెప్పిన విధానం బాగుంది. హర్రర్ లోను కామెడీ పండించిన విధానం మెప్పించింది. అయితే, ఫస్ట్ హాఫ్ లో పెద్దగా విషయం లేకపోవడంతో సినిమాకు మైనస్ గా నిలిచింది.

నటీనటుల పనితీరు:

అశ్విన్, అలీ సినిమాకు ప్లస్ అయ్యాయి. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి. అజ‌య్‌ఘోష్‌, ఊర్వశి పాత్రలు ద్వితీయార్ధంలో క‌డుపుబ్బా న‌వ్విస్తాయి. బురిడీ బాబాల్ని పోలిన వాళ్ల అవ‌తారం, దెయ్యాల్ని చూసి భ‌య‌ప‌డే తీరుతో న‌వ్వులు బాగా పండాయి. అవికా గోర్‌కి పెద్దగా న‌టించే అవ‌కాశం రాలేదు. ప‌తాక స‌న్నివేశాల్లో ఆమె దెయ్యంగా కాసేపు సంద‌డి చేస్తారు. మిగతా పాత్రలు వారి పరిధి మేరకు మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:

దర్శకుడు ఓంకార్ సినిమాను తీసిన విధానం ఆకట్టుకుంది. సినిమా కోసం ఎంచుకున్న చిన్న పాయింట్ కోసం దాని చుట్టూ అల్లుకున్న కథనాలు ఆకట్టుకున్నా.. సెకండ్ హాఫ్ వరకు ఆ కథనాల్లో పట్టు లేకపోవడం సినిమాకు మైనస్ గా నిలిచింది. సాంకేతికంగా సినిమా బాగుంది. చోటకే నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయ్యింది. షబ్బీర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ అయ్యింది.

పాజిటివ్ పాయింట్స్:

సెకండ్ హాఫ్

కాన్సెప్ట్

అలీ, అజయ్ ఘోష్, ఊర్వశి నటన

మైనస్ పాయింట్స్:

ఫస్ట్ హాఫ్

Rating:2/5