బుల్లితెర మీద మహర్షి డిజాస్టర్..!

SMTV Desk 2019-10-18 16:47:04  

సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన సినిమా మహర్షి. మహేష్ కెరియర్ లో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమా బుల్లితెర మీద మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. రీసెంట్ గా ఓ టివిలో టెలికాస్ట్ అయిన మహర్షి సినిమా ఆశించిన స్థాయికి తక్కువగా టి.ఆర్.పి రేటింగ్ తెచ్చుకుంది. మాములుగా స్టార్ సినిమాలకు 15 నుండి 20 మధ్యలో టి.ఆర్.పి రేటింగ్స్ వస్తాయి.

20 దాటిన సినిమాలు రికార్డులు సృష్టించిన సందర్భాలు ఉన్నాయి. ఇదిలాఉంటే మహర్షి మాత్రం 10కి తక్కువ రేటింగ్ తెచ్చుకుని షాక్ ఇచ్చింది. మహేష్ మహర్షి కేవలం 9.2 రేటింగ్ తో షాక్ ఇచ్చింది. మహేష్ కెరియర్ లో సూపర్ హిట్టైన ఈ సినిమా స్మాల్ స్క్రీన్ పై ఇంత దారుణమైన రేటింగ్ తెచ్చుకుంటుందని ఎవరు ఊహించలేదు. అయితే స్మాల్ స్క్రీన్ పై స్టార్ సినిమాలు రేటింగ్ తగ్గడానికి కారణం డిజిటల్ స్ట్రీమింగ్ వల్లే అని అంటున్నారు.