నీకు మబ్బులు విడిపోవడం ఖాయం శకుని మామా

SMTV Desk 2019-10-18 16:46:22  

ఏపీలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇంతకు ముందైతే ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమక్షంలో ఒకరి పై మరొకరు విమర్శలు చేసుకునేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా హవా ఎక్కువ కావడంతో దానినే అస్త్రం గా వాడుకుంటున్నారు. ట్విట్టర్ వేదికగా ఒకరి లోపాలను ఒకరు ఎత్తి చూపుతున్నారు. తాజాగా తెలుగుదేశం నేత బుద్ద వెంకన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ , విజయ్ సాయి రెడ్డి పైన విమర్శలు గుప్పించారు.

"నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం అని డబ్బా కొట్టుకుంటూ మీ కార్యకర్త వాలంటీర్లతో నువ్వు సాధించింది ఏంటో చెప్పగలవా.. ?అని ప్రశ్నించారు అంతెందుకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఒక్క సారి గ్రామాల్లో అడుగుపెట్టి చూడు.. నీకు మబ్బులు విడిపోవడం ఖాయం శకుని మామా !!" అంటూ రాసుకొచ్చారు. "తాను బెస్ట్ సీఎం అవుతాడు అనుకున్న వాడు కాస్తా తుగ్లక్ ముఖ్యమంత్రిగా మిగిలిపోయే సరికి శకుని (విజయ్ సాయిరెడ్డి )మామ మైండ్ దొబ్బింది. తుగ్లక్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది అని గమనించి రాష్ట్రం వదిలి ఢిల్లీకి పారిపోయావా శకుని మామా. ? " అంటూ ఎద్దేవా చేసారు. బుద్ద ట్వీట్ల పై వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి.