చిరంజీవి 152లో హీరోయిన్ ఫిక్స్

SMTV Desk 2019-10-17 15:08:29  

తెలుగు .. తమిళ భాషల్లో అగ్రకథానాయికగా త్రిష ఒక వెలుగు వెలిగింది. ఈ రెండు భాషల్లోనూ కొత్త కథానాయికల నుంచి పోటీ ఎక్కువ కావడంతో ఆమె వెనుకబడిపోయింది. అయితే ఆ మధ్య తమిళంలో వచ్చిన 96 మూవీ సూపర్ హిట్ కావడంతో ఆమెకి అక్కడ అవకాశాలు పుంజుకున్నాయి. అక్కడే కాదు ..ఇక్కడ కూడా త్రిష క్రేజ్ అలాగే వుంది.

ఈ నేపథ్యంలోనే చిరంజీవి తాజా చిత్రంలో కథానాయిక పాత్ర కోసం త్రిషను అడుగుతున్నట్టుగా సమాచారం. చిరంజీవి తన 152వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం త్రిషను సంప్రదిస్తున్నారట. ఇది మామూలు కాంబినేషన్ కాదు గనుక ఆమె అంగీకరించడం ఖాయమని చెప్పుకుంటున్నారు. గతంలో చిరంజీవి సరసన త్రిష స్టాలిన్ సినిమా చేసిన సంగతి తెలిసిందే.